Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందీనా..?: ఏఆర్ రెహ్మాన్ షాకింగ్ కామెంట్.. వీడియో వైరల్

AR Rahman Reaction To Anchor Speaking In Hindi At 99 Songs Launch
  • 99 సాంగ్స్ ఆడియో ఈవెంట్ లో వ్యాఖ్యలు
  • రెహ్మాన్ ను తమిళంలో.. హీరోను హిందీలో ఆహ్వానించిన వ్యాఖ్యాత
  • వైరల్ గా మారిన రెహ్మాన్ కామెంట్లు
ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ తొలిసారి నిర్మాతగా మారి ‘99 సాంగ్స్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. విశ్వేశ్ కృష్ణమూర్తి అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటిస్తున్న హీరోహీరోయిన్లు ఎహాన్ భట్, ఎడిల్సీ వర్గాస్ లూ కొత్తవారే కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఏఆర్ రెహ్మాన్ షాకింగ్ కామెంట్లు చేశారు.  

కార్యక్రమం సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ ను వ్యాఖ్యాత వేదికపైకి ఆహ్వానించారు. అయితే, అప్పుడు ఆమె తమిళంలో మాట్లాడారు. కానీ, ఆ తర్వాత హీరో ఎహాన్ భట్ ను పిలిచేటప్పుడు మాత్రం భాష మార్చింది. హిందీలో మాట్లాడుతూ స్వాగతం పలికింది. ‘‘ఎహాన్ భట్ జీ చెన్నై మే ఆప్ కా హార్దిక్ స్వాగత్ కర్తీ హూ (ఎహాన్ భట్ గారూ.. చెన్నై మీకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది)’’ అంటూ వ్యాఖ్యానించింది.

దీంతో రెహ్మాన్ ఒక్కసారిగా ‘హిందీనా’ అంటూ యాంకర్ వైపు చూశారు. నవ్వుకుంటూ వేదికి దిగుతున్న ఆయన ఒక్కసారి ఆగి.. ‘‘ఇంతకుముందే కదా, మీరు తమిళ్ లో మాట్లాడినట్టున్నారు’’ అనుకుంటూ వెళ్లిపోయారు. దానికి సంంబంధించిన వీడియో ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. కాగా, 99 సాంగ్స్ సినిమాకు రెహ్మాన్ కూడా కథా సహకారం అందించారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ ‘వైఎం మూవీస్’ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.
AR Rehman
99 Songs
Hindi
Tamil
Tamil Nadu

More Telugu News